Home / Reviews / 10.or E ఫోన్ సమీక్ష తెలుగులో

10.or E ఫోన్ సమీక్ష తెలుగులో

గత కొన్నేళ్ళుగా చాలా ఛైనీస్ ఫోన్ కంపేనీలు ఇండియాలో అమ్మకాలు మొదలు పెట్టడం జరిగింది. అలాంటి ఒక కంపెని 10.or, సెప్టెంబర్లో ఈ కంపెనీ రెండు ఫోన్లతో ఇండియాలో అమ్మకాలు మొదలుపెట్టింది. గత కొన్ని వారాలుగా మేము 10.or E ఫోన్ని రోజువారి ఫోనుగా వాడుతున్నాము . ఈ సమీక్షలో 1o.0r E ఫోన్ ఎలా ఉందో మీరు తెలుసుకుంటారు. అమేజోన్లో మాత్రమే దొరికే ఈ ఫోన్ 2GB మరియు 16GB సమాచారం నిల్వ చెసుకునే మోడెల్ని  7,999/- రూపాయలకి కొనుక్కోవచ్చు. ఆలానే, 3GB RAM మరియు 32GB సమాచారం నిల్వ చెసుకునే మోడెల్ని 8,999 రూపాయలకి కొనుక్కోవచ్చు.

బాక్స్ లో కంటెంట్

  • 10.or E ఫోన్
  • 10W ఛార్జర్
  • Micro-USB కేబుల్
  • Simని బయటకు తీసే పిన్
  • గైడ్లు

రూపకల్పన

10.or E ఫోన్ రూపం మిగతా చైనీస్ ఫోన్లలాగా సాదాగ ఉంటుంది. చూడడానికి అల్యుమినం బాడి లాగా ఉన్నా, 10.or E ఫోన్ బాడి ప్లాస్టిక్తో చేయబడినది. మంచి క్వాలిటి ప్లాస్టిక్ని  వాడటం వలన ఫోన్ గట్టితనం బాగుంది. ఫోన్ అడుగు భాగంలో ఒక micro-USB port, ఒక microphone మరియు స్పేకర్లను అమర్చడం జరిగింది.

ఫోన్ పై భాగంలో 3.5mm ఆడియొ పోర్ట్ మాత్రమే ఉంది. కుడిపక్కన పవర్ ఆన్/ఆఫ్ బటన్ అలానే వాల్యుం బటన్లు (వాల్యుం రోకర్ ) ఉన్నాయి. ఫోన్ ఎడమవైపు SIM ట్రే మరియు microSD కార్డ్ స్లాట్లను అమర్చడం జరిగింది. Hybrid SIM స్లాట్ కాకుండ microSD స్లాట్ మరియు రెండు SIM స్లాట్లను విడిగా ఇవ్వడం గమనించదగ్గ విషయం. 5.5″ డిస్ప్లే ఉన్నా కాని, ఫోన్ని ఒక చేత్తో వాడటం కష్టం అనిపించదు.

డిస్ప్లే

పదివేల రూపాయలకంతే తక్కువ రేటుకి అమ్ముడుపొయే ఫొన్లలో ఫుల్ హ్యెచ్డ్ 1080పి డిస్ప్లే ఉన్న ఫోన్లు చాలా అరుదు. 10.or E  ఫొన్లో 5.5″ 1920 x 1080 పిక్సెల్ రెజొలూషన్ డిస్ప్లేని అమర్చడం జరిగింది. డిస్ప్లే ప్రకాశం మరియు కలర్ పునరుత్పత్తి బాగున్నట్లే అని చెప్పవచ్చు. కొంట్రాస్ట్ మాత్రం కొంచెం బలహీనం, అలానే డిస్ప్లేలో నీలం రంగు కాంతిని తగ్గించే సెట్టింగ్ అందుబాటులో లేదు. మీకు గనుక ఈ సెట్టింగ్ అవసరం ఐతే, Google Play Storeలో చాలా అప్ప్లికేషన్లు ఉన్నాయి.

కెమేరా

10.or E ఫోన్లో వెనుక వైపు 13mp కెమేరా, అలానే ఫొన్ ముందు వైపు 5mp సెల్ఫీ కెమేరా ఉంది. వీడిఓ గరిస్ఠ రెజొలూషన్ 720p అవ్వడం ఈ కమెరాకి ఉన్న ఒక బలహీనత. ఫొటో క్వలిటి కూడ ఒక మోస్తారుగా పర్లేదు అన్నట్లు ఉంది. ఫొటోలో రంగుల యొక్క ఆక్యురసి (ఖచ్చితత్వం) అన్ని రకాల వెలుతుర్లలో బాగనే ఉన్నట్లు అనిపిస్తుంది. వెలుతురు తగ్గినప్పుదు ఫొటోలు కొంచెం గ్రైనీగా (ఫొటో నిండా చుక్కలు) వస్తాయి. HDR మోడ్ ఉన్నా కాని తక్కువ వెలుతురు ఉన్న సమయంలో అంత సహాయపడదు. కమేర యొక్క ఫోకస్ వేగంగానే ఉంటుంది. కెమేరా అప్లికేషన్ కూడా సాదాగా మరియు సాధారనంగా ఉంది. మాన్యువల్ మోడ్ (అనుకున్నట్లే) ఈ కమెరాకి లేదు. ఈ ధరకి DSLR లాంటి  ఫొటోలను ఆసించలేము కదా మరి.

హార్డ్వేరు మరియు పనితనం

10.or E లో ఉన్న క్వాల్కం వారి స్నాప్డ్రాగన్ 430 ప్రొసెసర్ బడ్జెత్ ఫోన్లలో ప్రముఖంగా వాడుతున్నారు. ఈ ఫోన్ 2GB లేదా 3GB RAMతో వస్తుంది. 2GB RAM మోడల్లో 16GB సమాచారం నిల్వ చెసుకొవచ్చు, 3GB RAM మోడల్లో  32GB డేటా నిల్వ చేసుకోవచ్చు. ఇంకా  కావలంటే, microSD కార్డ్ని వాడుకోవచ్చు. పవర్ తక్కువ వాడటం వల్లన, బ్యాటరీ కాలం పెరుగుతుంది. ఈ ఫోన్లో బ్యాటరీ ఇంచుమించు ఒకటి నుండి రెండు రోజులు వస్తుంది (భారీగా వాడకుండా ఉంటే). SD430 గ్రాఫిక్స్ కార్డ్ వల్లన చాలా వరకు గేంలలో లాగ్ లేకుండా ఉన్నాయి కాని గ్రాఫిక్స్ క్వాలిటి మాత్రం తక్కువగా ఉంటుంది. ఫోన్ వేడెక్కడం అనేది తక్కువగా జరుగుతుంది, అతిగా వేడెక్కడం అనేది లేదు.

సాఫ్ట్వేరు

10.or E ఆండ్రోఇడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. 10.or ప్రకారం ఈ ఫోన్ కి ఓరిఓ అప్డేట్ వస్తుంది. స్టాక్ ఆండ్రోఇడ్ని పెద్దగా మార్పులు లేకుండ లోడ్ చేసారు. అమేజోన్ లాంటి కొన్ని అప్లికేషన్లు ప్రి-లోడ్ చేసారు. ఇది కాకుండ ఊఈ లో మార్పులు ఏమీ లేవు. ఇందువలన ఫోన్లో ల్యాగ్ లేకుండా ఉంది.

బ్యాటరీ

10.ఒర్ ఏ లో బ్యాటరీ పరిమాణం 4000మాహ్ ఉంది. తక్కువ పవర్ వాడే  చిప్సెట్ మరియు సింపుల్ UI ఉండడంతో, బ్యాటరీ ఒకటి నుంచి రెండు రోజులు సులువుగా వస్తుంది. బాగ ఎక్కువగా ఫోన్ వాడినా 6-7 గంటల శొట్ (స్క్రీన్ ఆన్ టైం) వస్తుంది. కానీ పెద్ద బ్యాటరీ అవ్వడంతో పూర్తిగా ఛార్జ్ అవ్వటానికి రెండున్నర గంటలు పడుతుంది. క్విక్ ఛార్జింగ్ ఉంటే కొంచెం బాగుండేది.

తీర్పు

మీరు గనుక ఈ ఫోన్ని కొనేటట్లైతే, 3ఘ్భ్/32ఘ్భ్ మోడల్ తీసుకొవడం మంచిది. ఈ రోజుల్లో ఆంద్రొఇద్ ఓశ్ మరియు ఆంద్రొఇద్ అప్ప్స్కి 3ఘ్భ్ ఋఆం అనేది అవసరం.  ఈ ఫొనె ఋఎద్మి 4 కి గెట్టి పోటీ ఇవ్వగలదు. ఫోన్ బత్తెర్య్ మరియు పనితనం బాగుండడం, అలానె కోర్నింగ్ గొరిల్లా గ్లాస్స్ 3 మరియు Fఉల్ళ్డ్ దిస్ప్లయ్ అనేవి చెప్పుకోదగ్గ ఫీచర్లు. మార్పుల్లేని ఆంద్రొఇద్ ఓశ్ వాడటం వల్లన అప్డేట్స్ రావటం కూడ సులభం అవుతుంది అలానే, ఫోన్ యొక్క పనితనం కూడ మెరుగ్గా ఉంటుంది. ఈ ఫోన్ అమ్మకం ఆమజొన్ లో  మాత్రమే, సెర్విచె ని భ్2X కంపెని చూసుకుంటుంది. 10.ఒర్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే, 10.ఒర్ వెబ్సైట్కి వెల్లవచ్చు.

About bandla

Testing on Cloud