ఈ మధ్య మొబైల్ ఫోన్లు టపాకాయల్లాగా కాలటం లేదా పేలటం ఎక్కువయ్యింది. కొన్ని సందర్భాల్లో ఫోన్ కంపెనీల నాణ్యత తనిఖీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. కానీ చాలా సందర్భాల్లో మన అజ్ఞానం కారణం అని చెప్పవచ్చు. మనం వాడే ఫోన్ ఎంత ఖరీదైన ఫోన్ అయినా కొన్ని ప్రాథమిక సూత్రాలు అనుసరించకపొతే ఇలాంతి ప్రమాదాలు జరుగుతాయి. ఈ వ్యాసంలో సాధారణంగా మనం చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
#1 నాణ్యత లేని ఛార్జర్లు
మనం ఒక ఫోన్ కొనే ముందు వంద సార్లు ఆలోచిస్తాం కానీ ఛార్జర్ కోసం దగ్గర్లో ఉన్న షాపులోకి వెళ్ళి సన్న పిన్ను ఛార్జర్ అనో బద్ద ఛార్జర్ అనో చెప్పి తీసుకుంటున్నాము. కారు ఉన్న వాల్లైతే సిగ్నల్ దగ్గర అమ్మే నాసిరకం 10-15 వైర్లు ఉండే ఛార్జర్ తీసుకుని పండగ చేసుకుంటారు. ఒక చార్జర్లో విద్యుత్ పాస్ అవ్వటానికి వైర్లు, ఒక పిన్ను మాత్రమే కాదు ఉండేది. చూడడానికి మాములుగానే ఉన్నా, మొబైల్ యొక్క ఆరోగ్యానికి ఛార్జరుకి చాలా పెద్ద సంబంధం ఉంది. మొబైల్ ఛార్జర్ ఆఛ్ విద్యుత్తుని డ్ఛ్ విద్యుత్తుగా మార్చి పంపడం మాత్రమే కాదు, ఎంత వోల్టేజ్, ఆంపియర్, వాటేజ్ సెట్ చెయ్యాలో ఫోన్ నుంచి తెలుసుని అంత మాత్రమే విద్యుత్తుని ఫోన్లోని బ్యాటరీకి పంపుతుంది.
ప్రతి చార్జర్లో ఒక చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంటుంది. ఈ సర్క్యూట్ ఊశ్భ్ ద్వారా ఫోన్లో ఉన్న బ్యాటరీ పవర్ని నియంత్రించే సర్క్యూట్తో నిరంతరం లింకులో ఉంటుంది. ఫోన్ నిర్ధారించిన పవర్ని మాత్రమే బ్యాటరీకి పంపుతుంది. అంతే కాదు, ఒకసారి బ్యాటరీ నిండగానే ఫోన్లో ఉన్న సర్క్యూట్ నుంచి ఛార్జర్కి ఇంక ఛార్జ్ చాలు అని సూచన వస్తుంది. ఒకవేల అతి వోల్టేజ్ ఉత్పత్తి అయినా లెదా ఛార్జర్ కానీ ఫోన్ కాని అతిగా వేడెక్కినా, విద్యుత్తు ఫోన్లోని బ్యాటరీకి చేరకుందా సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది.
ఈ చిప్ గనుక సరిగ్గా లేకపోతే ఫోన్ బ్యాటరీకి ఎక్కువ విద్యుత్తు వెళ్ళి బ్యాటరీ పేలటం ఖాయం. ఛార్జర్ గనుక ఆపకుండా విద్యుత్తుని పంపితే బ్యాటరీ ఓవర్లోడ్ అయ్యి పేలతం జరుగుంతుంది. కొత్తగా వచ్చే ఫోన్లలో ఇలా అవ్వకుండా బ్యాటరీ దగ్గరే సర్క్యూట్ బ్రేకర్లు ఉంటాయి. ఇంత భద్రతా తనిఖీ కొన్ని చైనా ఫోన్లలో ఉండడం జరగదు. అలానే ఊశ్భ్ మరియు ఛార్జింగ్ కేబుల్లో వాడే రాగి వైర్ నాణ్యమైనది కాకపొతే వేడి ఉత్పత్తి అయ్యి కరగటం లెదా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంట రావడం జరుగుతుంది. వైర్ చుట్టూ ఉండే ఇన్సులేషన్ కూడా నాసిరకం వాడితే కరిగిపొయే అవకాశాలు ఎక్కువ.
#2 అనధికార సేవా కెంద్రాలు
మన ఫోనుకి ఎప్పుడైనా మరమ్మత్తు అవసరమైతే, ఆ ఫోన్ని అధికార సేవా కేంద్రాలకి మాత్రమే తీసుకువెల్లండి. ఈ కెంద్రాలలో పని చెసే ఇంజనీర్లకి తరచుగా ట్రైనింగ్లు ఉంటాయి. ఈ ట్రైనింగ్లలో ప్రతీ మొడెల్ని అధ్యయనం చేయించి, అన్ని రకాల రిపైర్లను ఏలా చెయ్యాలో నేర్పిస్తారు. అంథే కాధు, ఈ సేవా కేంద్రాలలొ నాణ్యత కలిగిన ఒరిజినల్ విడిభాగాలను మాత్రమే వాడటం జరుగుతుంది.
అనధికార సేవా కెంద్రాలలో మీ ఫోన్ని మరమ్మత్తు చెయడం సరిగ్గా తెలియని ఇంజినీరు మరమ్మత్తు చేసినప్పుడు ఎక్కడైనా అంతర్గత సర్క్యూట్లు కానీ అంతర్గత కనెక్షన్లు కాని దెబ్బతింటే ఫోన్ వేడెక్కి పేలడం జరగవచ్చు. కొంతమంది సొంత తెలివి వాడి యూట్యూబ్ వీడియోలు చూసి రిపైర్ చెయ్యాలని చూస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. ఇలాంటివి చెయ్యకపోవడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే అధికార సేవా కెంద్రాలలో చూపించండి.
#3 నకిలీ బ్యాటరీ
ఇప్పటికీ కొన్ని ఫోన్లలో బ్యాటరీని మమమే మార్చుకోవచు. కొంతమంది తక్కువలో వస్తుందని నాన్యత లేని నకిలీ బ్యాటరీలని కొంటారు. వీటికి నాణ్యత తనిఖీ జరగదు, ఫాల్ట్ టాలరెన్స్ ఉండదు, అలానే వేడిని తట్టుకునే శక్తి కూడా ఉండదు. ఇలాంటి బ్యాటరీలను వాడటం వల్ల ఫోన్ పాడయ్యే చంచెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇంకొక బ్యాటరీ కావలంటే, మంచి పవర్ బ్యాంక్ కొనుక్కోండి. లెదంటే కంపేనీ వారి షోరూములో బ్యాటరీ కొనడం మంచిది.
#4 మితిమీరిన ఛార్జింగు
చాలా మందికి రాత్రి ఫోన్ ఛార్జి పెట్టి పడుకోవడం అలవాటుగా మారింది. ఇది ఫోనుకి అలానే బ్యాట్తరికి ప్రమాదకరం. వీలున్నప్పుడల్లా ఫోనుని ఛార్జి చెసుకుంటూ ఉంటే మీ ఫోనుని రాత్రి పూట ఛార్జింగ్ పెట్టే అవసరం ఉండదు. ఛార్జ్ బాగా తగ్గేంత వరకు ఉంచి వెంటనే 100% అయ్యే వరకు ఛార్జ్ చెయ్యవలసిన అవసరం లెదు. మీకు ఏప్పుడు వీలైతే అప్పుడు ఛార్జ్ చేస్తూ ఉండండి. దీని వల్లన బ్యాటరీ జీవితం పెరుగుతుంది. ఎక్కువగా ఛార్జింగ్ వల్ల బ్యాటరీకి జీవితం తగ్గటమే కాదు, ఫోన్ లెదా బ్యాతరి పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
#5 ఊహించని దెబ్బలు
కొంతమంది ఫోన్ని చాలా అజాగ్రత్తగా అక్కడ ఇక్కడ పడేస్తూ వాడడం చేస్తుంటారు. కొంతమంది ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు తరచుగా ఫోన్ని విసిరివెయ్యడం లాంటివి చెస్తుంటారు. దీని వల్లన ఫోన్లో ఉన్న సున్నితమైన భాగాలకి శాశ్వత నష్టం అయ్యే అవకాసం ఉంది. ఈ నష్టం బ్యాటరీకి అయితే, బ్యాటరీ పేలే అవకాశాలు బాగ ఏక్కువగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది. ఒక వేల మీ ఫోన్ గనుక క్రాక్ అయ్యినా, బ్యాటరి ఉబ్బినట్లు అనిపించినా వెంటనే అధికార సేవా కేంద్రంలో చూపించండి.