మన దగ్గర OnePlus 5 సులభంగానే దొరుకుతుంది కాని కొన్ని దేశాలలో ఈ ఫోన్ షాప్లలో నిల్వ ఉండట్లేదు. ఓనెఫ్లుస్ యాజమాన్యం దీనికి అసాధారణ డిమాండ్ కారణం అంటున్నారు. నిజానికి OnePlus 5T ఫోన్ని ప్రవేసపెట్టడం కోసమే OnePlus 5 ఉత్పత్తిని తగ్గించారు అని వదంతులు వస్తున్నాయి.
ఈ రోజు చైనాలోని వైబో అనే సోషల్ నెట్వర్కులో OnePlus 5T ఫొటోని లీక్ చేసారు. వెనుకవైపు చూస్తే వేలిముద్ర నమోదు చేయు పరికరాన్ని ఓనెఫ్లుస్ లోగో పైన అమర్చారు. ఈ మధ్య వచ్చే అన్ని ఫోన్లలో ఇదే రూపకల్పనని అనుసరించడం జరుగుతుంది.
వేలిముద్ర నమోదు చేయు పరికరాన్ని ఇక్కడ అమర్చడానికి ముఖ్య కారణం ముందు వైపు పెరిగిన స్క్రీన్ పరిమాణం. అంతే కాకుండా స్క్రీన్ నాలుగు వైపులా అంచులను బాగా తగ్గించడం జరిగింది. కుడి ఎడమ వైపు స్క్రీన్ ఫోన్ అంచులవరకు ఉంటుంది అలానే పైన కింద కెమేరా మరియు సెన్సార్ల కోసం సన్నటి అంచులను ఉంచారు. స్క్రీన్ కారక నిష్పత్తి (అస్పెచ్త్ రతిఒ) ఇప్పుడు LG G6 అలానే Vivo/Honor ఫోన్లకి లాగా 18:9 కి మారుతుంది.
అన్ని కంపెనీలు 18:9 నిష్పత్తితో అలానే అంచులులేని స్క్రీన్ తో ఫోన్లను విడుదల చెయడంతో OnePlus కంపెనీకి ఇప్పుడు వేరే దారి లేదు. ఇదే గనుక కచ్చితమైన రూపం ఐతే మరొసారి OnePlus పెద్ద కంపనీల గుండెల్లో కలకలం రేపడం ఖాయం.