ఓప్పొ ఇటీవలే సెల్ఫీ ఇష్థపడే వాళ్ల కోసం ఏ57 స్మార్ట్ ఫోన్ విడుదల చెసారు. 16 ఎంపి సెల్ఫీ కెమేర ఒకటి సరిపొతుందా? కాని ఒక్క మంచి కెమేరా ఉంటే సరిపొదు కదా. మరి చూద్దామా ఓప్పొ ఏ57 ఎలా ఉంటుందో చూద్దాం.
ఆక్రుతి (డెసైన్ )
ఏ57 యొక్క ఆక్రుతి ఇతర ప్రముఖ మొబైల్ ఓప్పొ F1ఎస్ ను పోలి ఉంటుంది. ఆ57 యొక్క శరీరం ప్లాస్టిక్ అయినా మెటల్ శరీరం అన్నట్లుగా ఉంటుంది. మెటల్ చట్రం వల్లన ఆ57 చేతిలో బలమైన మరియు ప్రీమియం ఫొన్ లాగ అనిపిస్తుంది. ఏ57 లో 5.2 అంగుళాల display 720పి హెచ్డి (HD) రెసోల్యూషన్తో వస్తుంది. Fingerprint సెన్సర్ని Display కింద అమర్చటం జరిగింది. నేవిగేషన్ (బేక్ మరియు మెను) కీలు Display లోనె ఉన్నాయి. ఫొన్ క్రింద పేనెల్ లో Fingerprint తప్ప ఏ కీలు ఉండవు. వీటిని On-screen మెను కీలు అంటారు. ఏ57 లో రెండు SIM కార్డులను పెట్టుకోవచ్హు. ఇవి కాక ఒక ప్రత్యేక స్లాట్లొ MicroSD కార్ద్ పెట్టుకోవచ్హు. MicroSDకి ప్రత్యేక స్లాట్ ఇవ్వటం ఒక గొప్ప లక్షణం ఎందుకంటే మిగతా ఫొన్ లొ లాగ SD కార్ద్ కొసం SIM ని తీయవలసిన పని లేదు. ఫొనె దిగువన 3.5mm ఆడియో జాక్, microUSB పొర్ట్ మరియు మోనో స్పీకర్ ఉన్నాయి.
5.2 అంగుళాల display, ఫ్లాట్ శరీరం మరియు తక్కువ బరువు వల్లన ఏ57 ఫొన్ ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. షైన్ లేని శరీరం చేతిలోనుంచి జారకుండా ఉందటానికి మంచి పట్టును ఇస్తుంది. ఓప్పొ ఏ57 చూడడానికి అంత అందంగా ఉండక పోవచ్హు కాని వాడుకకు హాయిగ ఉంటుంది.
Display
ఓప్పొ ఏ57 display లో 720p IPS పేనెల్ ఉంది. 15,000/- రూపాయల ఫొన్లో 720p ఏమిటి అనిపిస్తుంది. కాని display పనితీరు చూసాక అంత వ్యత్యాసం కనిపించదు. IPS పేనెల్ అవ్వటం వలన ఏ కోణాల నుంచి చూసినా ఒకే లాగ కనిపిస్తుంది. భయట ఎండలోకి వచ్చినా display ప్రత్యక్షత ఖచ్చితంగా ఉంటుంది. ఏ57 లో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే display రక్షణకి Gorilla Glass 4ని వాడటం జరిగింది. దీని వల్లన గీతలు పడడం కొంత తగ్గుతుంది అలానే మిగతా రక్షణ కవర్లతో పోలిస్తే కొంచెం బలం ఏక్కువ ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఓప్పొ ఏ57 display పనితీరును మెచ్చుకోవచ్చు.
ఫోన్ పనితీరు
ఓప్పొ ఏ57 ఫొన్లొ Qualcomm వారి Snapdragon 435 ప్రొసెసర్ అమర్చబడి ఉంది. ఆలానె 3GB RAM మరియు 32GB స్టోరేజి మెమరీ ఉంది. వర్చువల్ రియాలిటీ (VR) కోసం గైరోస్కోప్ కూడా ఉంది. Reliance వారి Jio లాంటి కనెక్షన్ కొసం VoLTE సామర్థ్యం ఉంది. రెండు SIM కార్డు స్లాట్లలో ఏ స్లాట్లో అయినా Jio SIM పెట్టుకొవచ్చు. ఏ57 లో భ్లుఎతూథ్ 4.1, వై-ఫై 802.11 బి / జి / ఎన్, ఎఫ్ఎమ్ రేడియో, ఊశ్భ్-ఓట్ఘ్, మరియు ఘ్ఫ్శ్ సామర్ధ్యం కలిగి ఉన్నది. పనితీరు పరీక్ష కోసం దాదాపు నలభై అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసాము. ఈ అప్లికేషన్లలో కొన్ని సాధారణమైనవి మరియు కొన్ని భారీవి. ఈ ఫోన్ అన్ని రకాల అప్లికేషన్లను అవలీలగా నడపగలిగింది. Snapdragon 435 అయినప్పతికి display రెసోల్యూషన తో 720p అవ్వుట వలన మరియు మంచి ఋఆం నిర్వహణ వల్లన ఏలాంటి సమస్య లేదు. 30 నిమిషాలు నిరంతరం గేంలు ఆడినప్పుడు ఫోన్ వేడి అవ్వటం మొదలు అయ్యింది. ఇది చాలా సాధారణ విషయం. గేంలు ప్రొసెసర్ని అత్యధిక వేగంతో పని చేయిస్తాయి, అందువలన ఫోన్ కొంచెం వేడెక్కడం సాధారణ విషయం.
ముందు వైపు ఉన్న వేలిముద్ర (fingerprint) సెన్సార్ వేగవతము మరియు సమర్థవంతమైనది. వేలిముద్ర (fingerprint) సెన్సార్ని ఫోన్నే కాకుండ అప్లికేషన్లను మరియు ఫైళ్ళను కూడ లాక్ చేయవచ్చు. ఫోన్ అడుగున ఉన్న మోనో స్పీకర్ ధ్వని కాల్ మరియు నోటిఫికేషన్ హెచ్చరికలకు బిగ్గరగా ఉంటుంది కాని పాటలకు మరియు సినిమాలకు చిన్నదిగా అనిపిస్తుంది.
కెమెరా
ఓప్పొ ఏ57 లో 16mp ప్రధాన కెమెరా (ఫోన్ వెనక భాగంలో) మరియు 16mp సెల్ఫి (ఫోన్ ముందు భాగంలొ) ఉన్నాయి. కెమెరాల మెగా పిక్సెల్ ఒకటే అయినప్పటికీ, కెమెరా సెన్సార్ పనితీరు భిన్నంగా ఉంటుంది. సెల్ఫి కెమెరా ఈ ఫోన్లో ప్రధాన ఫీచర్ అవ్వుట వలన మంచి సెల్ఫిలు తీయవచ్చు. నేపధ్యం (బచ్క్గ్రౌంద్) మసక చెయ్యటం ఈ ఫోన్ కెమెరాలో ఉన్నటువంటి ఒక ఫీచర్. కాని ఆ ఫొటొలు బాగ కృత్రిమంగా అనిపిస్తాయి. ఈందువలన ఈ ఫీచర్ని వాడకపొవటమే మంచిది. తక్కువ కాంతి ఉన్న ప్రదేసాలలొ సెల్ఫి ఫొటొలు స్పస్టంగా రావు.
ప్రధాన కెమెరా కూడ కాంతి బాగ ఉన్నప్పుడు మంచి నాణ్యమైన ఫొటోలు వేగంగా తీస్తుంది. అలానే తక్కువ కాంతి ఉన్న ప్రదేసాలలొ మంచి ఫొటొస్ క్లిక్ చెయ్యటానికి కొంచెం కష్టపడాలి. మీరు గనుక ఈ ఫోన్ని కెమెరా కొసమే కొనాలనుకుంటే వేరె ఫోన్ తీసుకోవటం మంచిది. హొనొర్ 6X ఋఎద్మి ణొతె 4 ళెనొవొ ఫ్2 లాంటి ఫోన్లు ఇంకా మంచి కెమెరా నాణ్యత కలిగి ఉన్నాయి. సాధారణంగా ఉండే ఫొటోస్ చాలు అనుకుంటె ఈ ఫోన్ కొనవచ్చు.
క్రింది కెమెరా నమూనాలు మా Facebook పేజీకి లింక్ చెయబడి ఉన్నాయి. ఈ Facebook పేజీని ఫాలో అవ్వటం మర్చిపొవద్దు.
సాఫ్ట్ వేర్
ఓప్పొ ఏ57లొ ColorOS 3.0 అనబడే ఒపరేటింగ్ సిస్త్టం (OS) వస్తుంది. ఈ ఒపరేటింగ్ సిస్త్టం యాండ్రాయిడ్ 6.0 ఆధారితమైనది. ఛైనా నుండి వస్తున్న ఓశ్లతో పొల్చి చూస్తే ఛొలొరోశ్ 3.0 సర్వోత్తమీకరణం (Optimziation) మంచిదిగా అనిపిస్తుంది. ఆవసరం లేని అప్లికేషన్లను ఇన్స్తాల్ చెయ్యటం జరగలేదు. ఇందువలన ఫోన్ వేగవంతంగా అనిపిస్తుంది. మీ కోసం మేము కొన్ని గైడ్లు తయారు చెసాము (ఇంగ్లిష్ లో). తప్పకుండ ఒకసారి ఈ గైడ్లను చూస్తారని ఆసిస్తున్నాము.
బ్యాటరీ
ఓప్పొ ఏ57లో 2900mAh బ్యాటరీ అమర్చబడింది. సాధారణ వాడుకతో ఏ57 బ్యాటరీ లైఫ్ సులభంగా ఒక రోజు వస్తుంది. SoT (Screen-on-Time) చూస్తే ఇంచుమించుగ మూడు నుంచి నాలుగు గంటలు వస్తుంది. ఛార్జింగ్ కూడ రెండు గంటలకంటే ఎక్కువ తీసుకొదు.
Verdict
15000/- లోపల ఫోన్లలో మంచి ఫోన్లు ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి. ఇంటికి దగ్గర ఉన్న షాప్లో దొరికే ఫోన్లలో ఓప్పొ ఏ57లో మంచిది అని చెప్పవచ్చు. మీరు గనుక ఆన్లైన్లో కొనగలిగితే Honor 6x, Lenovo P2, Redmi Note 4 వంటి ఫోన్లు చూడండి. మీ బడ్జెట్ ఇంకొంచం పెంచగలిగితే Mi5, ASUS ZenFone 3 వంటి శక్తివంతమైన ఫోన్లు చూదవచ్చు. ంఈ కొసం మేము దాదాపు 50 ఫోన్లు ఉన్న ‘రెచొమ్మెందెద్ ఫొనెశ్ లిస్ట్ తయారు చేసాము. ఈ పేజి ఒపెన్ చెస్తే మీకు లిస్త్ వస్తుంది.