ఒక్క సారి ఆలోచించండి. మీ ఫోన్ బ్యాటరీ గనుక వారం రోజులు వస్తే ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది కదూ. ఔకిటెల్ (OUKITEL) అనే ఒక చైనా కంపెనీ K8000 పేరుతో ఒక ఫోన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లో 8000mAh బ్యాటరీని అమర్చారు. మనం మామూలుగా వాడే ఫోన్లలో 2000 నుంచి 3000mAh వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. దీనికి తోడు తక్కువ పవర్ వాడే ప్రోసెస్సర్ మరియు తక్కువ రెసోల్యూషన్ కలిగిన డిస్ప్లే వాడే సరికి ఫోన్ బ్యాటరీ ఇంచు మించు అయిదు రోజులవరకు వస్తుంది. ఈ ఫోన్కి అమ్మకాలు త్వరలోనే చైనాలో మొదలవుతాయి.
ఈ కాలపు ధోరణి ప్రకారం ఔకిటెల్ K8000 ఫోన్ వెనుక భాగంలో రెండు ప్రధాన కెమేరాలను అమర్చారు. వీటిలో ఒకటి 16ంmp సెన్సార్ ఐతే మరొకటి 2mp సెన్సార్. ఫోన్ ముందువైపు 13mp సెన్సార్ని అమర్చారు. ఈ ఫోన్లో 5.5″ AMOLED 1280 x 720 పిక్సెల్ రెసోల్యూషన్ కలిగిన డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేని సాంసంగ్ (Samsung) తయారుచేసింది. AMOLED మరియు తక్కువ రెసోల్యూషన్ కలిగిన డిస్ప్లే అవటం వల్లన బ్యాటరీ వాడుక తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ శరీరాన్ని అల్యూమినియంతో తయారు చేసారు. అలానే ఆంటెన్నా డిసైన్ని కూడా మార్చడం జరిగింది. ఔకిటెల్ ఈ ఫోన్లో ఆండ్రోఇడ్ 7.0 నూగా (Nougat) ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసారు.
ఔకిటెల్ K8000 ముఖ్య ఆకృతీకరణ
- MT6750T Octa-core Cortex A53 1.5GHz
- 4GB RAM+64GB ROM
- 5.5”HD AMOLED display
- 16MP+2MP & 13MP cameras
- 8000mAh Li-polymer Battery
- 9V/2A Flash Charge
- Aluminum Unibody